: కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు అద్భుతం: నారా రోహిత్


కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు అద్భుతమని సినీ నటుడు నారా రోహిత్ తెలిపాడు. కృష్ణా జిల్లా విజయవాడలోని పున్నమి ఘాట్ లో పుష్కర స్నానం చేసిన నారా రోహిత్ ప్రభుత్వ ఏర్పాట్లను మెచ్చుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కృష్ణా పుష్కరాల్లో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని అన్నాడు. గోదావరి పుష్కరాల్లో పాల్గొనలేదన్న లోటు కృష్ణా పుష్కరాల్లో పాల్గొనడం ద్వారా తీరిపోయిందని తెలిపాడు. ప్రజలంతా పుష్కరాల్లో ఆనందంగా పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపాడు. పుష్కరాలు ఘనంగా నిర్వహించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందుతుందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News