: చైనా మాంజాలు ఢిల్లీలో ఇక అమ్మబోరు!
గాలిపటాలను ఎగుర వేసేందుకు ఉపయోగించే చైనా మాంజాలతో ప్రమాదాలు జరిగిన అంశాలను దృష్టిలో పెట్టుకుని వాటి అమ్మకాలపై కేజ్రీవాల్ సర్కార్ నిషేధం విధించింది. రెండు రోజుల క్రితం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవం రోజున చైనా మాంజాను గాలిపటాల ఎగురవేతకు ఉపయోగించడంతో ఇద్దరు చిన్నారులు, ఓ యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆగస్టు 15న కూడా ఢిల్లీలో గాలిపటాలు ఎగురవేస్తుంటారు. వాటిలో చైనా మాంజాను ఈ మధ్యకాలంలో అధికంగా వినియోగిస్తున్నారు. చైనా మాంజాకు గాజు కోటింగ్ ఉంటుంది. ఈ మాంజా ప్రమాదకరంగా మెడకు కోసుకుపోవడంతో వేరు వేరు ప్రాంతాల్లో మూడేళ్ల బాలిక, నాలుగేళ్ల బాలుడు మృతి చెందారు. బైక్‌పై వెళుతోన్న జాఫర్‌ఖాన్ అనే యువకుడు మాంజా తగిలిన కారణంగా మృతి చెందాడు.