: నా కెరీర్ లోనే ఇదో బెస్ట్ మూమెంట్!... రియో విజయంపై సింధు కామెంట్!


రియో ఒలింపిక్స్ లో కాకలు తీరిన భారత క్రీడాకారులంతా చాప చుట్టేసుకుని తిరిగివస్తున్న క్రమంలో తెలుగు తేజం పీవీ సింధు భారతీయుల ఒలింపిక్ పతకంపై ఆశలు రేపింది. నిన్న రాత్రి జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ లో వరల్డ్ నెంబర్:2 క్రీడాకారిణి వాంగ్ పై విజయం సాధించిన సింధు సెమీస్ చేరుకుంది. మ్యాచ్ లో విజయం సాధించిన సింధుపై ప్రశంసలు జల్లు వెల్లువెత్తుతుండగా... తాను సాధించిన ఈ విజయంపై సింధు నోరు విప్పింది. ‘‘రియోలో ఆడుతున్న ఫీలింగ్ కొత్తగా ఉంది. నా కెరీర్ లోనే ఇదో బెస్ట్ మూమెంట్. ఈ తరహా బెస్ట్ మూమెంట్స్ మరిన్ని వస్తాయని భావిస్తున్నా. ఆట గురించి మాత్రమే ఆలోచించా. ఉత్తమంగా రాణిస్తే గెలుపు దానంతటదే వస్తుంది. మెడల్ కూడా వస్తుంది. కేవలం మ్యాచ్ పైనే ఫోకస్ చేశా. ఇక తర్వాతి మ్యాచ్ పై దృష్టి పెడతా. అందులోనూ మెరుగ్గా రాణించగలనని భావిస్తున్నా’’ అని సింధు పేర్కొంది.

  • Loading...

More Telugu News