: కడప జిల్లాలో కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు!... నీరు- చెట్టు కార్యక్రమంలో ఘర్షణ!
కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య రాళ్ల దాడి జరిగింది. జిల్లాలోని కొండాపురం మండలం టి.కొడూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకెళితే... ప్రభుత్వ కార్యక్రమం నీరు- చెట్టు కార్యక్రమానికి చెందిన పనుల విషయంలో గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, ఆ తర్వాత పరస్పర రాళ్ల దాడి చోటుచేసుకుంది. ఫలితంగా ఇరు వర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఓ వర్గం బయలుదేరింది. అయితే ఆ వర్గంపై మరోమారు దాడికి దిగిన ప్రత్యర్థి వర్గం రాళ్ల వర్షం కురిపించింది. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.