: కాంకేర్ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్... పెద్ద ఎత్తున మావోయిస్టుల క్యాంప్‌లు ధ్వంసం... పేలుడు ప‌దార్థాలు స్వాధీనం


ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని కాంకేర్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న స‌మాచారంతో ఈరోజు ఆ ప్రాంత‌ంలో పోలీసులు పెద్దఎత్తున‌ కూంబింగ్‌ నిర్వహించారు. పోలీసులకి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టు క్యాంపులు క‌నిపించాయి. దీంతో 12 కు పైగా మావోయిస్టుల క్యాంప్‌లను పోలీసులు ధ్వంసం చేశారు. అక్క‌డి నుంచి భారీ ఎత్తున తుపాకులు, పేలుడు ప‌దార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వారి దాడులు ఇంకా కొన‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News