: సుప్రీం గడప తొక్కిన సంపత్!... తెలంగాణ స్పీకర్, ‘జంపింగ్’ ఎమ్మెల్యేలకు నోటీసులు!
తెలుగు రాష్ట్రాల్లో పెను రాజకీయ కలకలానికి తెర లేపిన పార్టీ ఫిరాయింపుల అంశం మరోమారు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది. టీ కాంగ్రెస్ యువనేత, పాలమూరు జిల్లా అలంపూరు ఎమ్మెల్యే సంపత్ కుమార్ పార్టీ ఫిరాయింపులపై దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం కొద్దిసేపటి క్రితం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారితో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా సదరు నోటీసులకు సమాధానం చెప్పాలని ధర్మాసనం ఆ నోటీసుల్లో ఆదేశాలు జారీ చేసింది.