: 200 మంది పోలీసులతో మాదన్నపేట పరిధిలో నిర్బంధ తనిఖీలు.. 12 మంది అరెస్ట్
హైదరాబాద్ మాదన్నపేట పరిధిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు (కార్డన్ సెర్చ్) నిర్వహించారు. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 200 మంది దక్షిణ మండల పోలీసులతో సోదాలు కొనసాగాయి. తనిఖీల్లో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఏడుగురు రౌడీషీటర్లు, ఐదుగురు అనుమానితులు ఉన్నారు. సరైన పత్రాలు లేని 44 బైకులు, మూడు ఆటోలు, ఏడు మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు వ్యక్తులకు సంబంధించిన గుర్తింపు కార్డులు, వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు.