: ఏపీ తరఫు లాయర్ వాదనలకు బ్రజేష్ కుమార్ ఫిదా!... సమయం ముగిసినా అరగంట పాటు ఆలకించిన వైనం!
కృష్ణానది జలాల పంపకంపై నిన్న బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ విచారణకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక తరఫు న్యాయవాదులు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని హాజరయ్యారు. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపించారు. నీటి వాటాలపై గంగూలీ వాదనలు ఆసక్తికరంగా సాగాయి. ఆయన వాదిస్తున్న తీరు ట్రైబ్యునల్ న్యాయమూర్తి బ్రజేష్ కుమార్ ను బాగా ఆకట్టుకుంది. వెరసి 4 గంటలకు విచారణను ముగించాల్సిన ట్రైబ్యునల్ మరో అరగంట పాటు గంగూలీ వాదనలను వింది. సాధారణంగా ట్రైబ్యునల్ సాయంత్రం 4 గంటలకు తన విచారణను ముగించాల్సి ఉంది. అయితే గంగూలీ చేస్తున్న వాదనలు ఆసక్తిరకరంగా ఉండటంతో బ్రజేష్ కుమార్ టైమ్ నే చూసుకోలేదు. నిర్ణీత సమాయానికన్నా అరగంట అదనంగా గంగూలీ వాదనలు విన్న బ్రజేష్ కుమార్... మిగిలిన రాష్ట్రాల వాదనలను నేటికి వాయిదా వేసేశారు.