: పుష్కరాలలో మరో అపశ్రుతి... కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థుల గల్లంతు


కృష్ణానది పవిత్ర పుష్కర మహోత్సవం ఐదవ రోజుకు చేరిన వేళ, మరో అపశ్రుతి దొర్లింది. ఐదు కుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. ఈ ఉదయం గుంటూరు జిల్లా అమరావతి మండలం జిడుగు దగ్గర కృష్ణా నదిలో స్నానాలకు వెళ్లి ఈతలు కొడుతున్న ఐదుగురు గల్లంతయ్యారు. వీరంతా నందిగామ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. గల్లంతైన వారిని హరీశ్, గోపిరెడ్డి, నగేష్, లోకేష్, హరిగోపిలుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న అత్యవసర టీం, ప్రస్తుతం వారి కోసం నదిలో విస్తృతంగా గాలిస్తోంది. నదిలో నీటి ప్రవాహం ఉండటంతో, వీరు దిగువ ప్రాంతాలకు కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News