: కాంగ్రెస్ నేతలకు ఎందుకింత కడుపుమంట?: టీఆర్ఎస్ ఎంపీ కవిత
ప్రజలకు సన్నబియ్యం, తాగునీరు అందిస్తుంటే కాంగ్రెస్ నేతలకు ఎందుకింత కడుపుమంట? అని టీఆర్ఎస్ ఎంపీ కవిత దుయ్యబట్టారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. శ్రీరాం సాగర్ బాధితులకు 40 ఏళ్లుగా పరిహారం ఇవ్వని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మల్లన్న సాగర్ బాధితుల కోసం పోరాడతామనడం హాస్యాస్పదమేనని అన్నారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎనిమిది నెలలుగా కాలయాపన చేస్తున్నారని ప్రజాసంక్షేమం ఆ పార్టీ నేతలకు పట్టదని కవిత అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసమే టీఆర్ఎస్ పార్టీ వుందని, కాంగ్రెస్ చేస్తోన్న వ్యాఖ్యలపై స్పందించడం కోసం కాదని ఆమె వ్యాఖ్యానించారు.