: మందు అలవాటు చేసి హత్య చేయించారు: డాకూరి బాబు
ఈ ఉదయం టీవీ 9 స్టూడియో లైవ్ కార్యక్రమంలో అరెస్టయిన డాకూరి బాబు, అంతకుముందు అదే టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తనకు మద్యం అలవాటు లేదని, యాదగిరి, మరో ఐదుగురు మిత్రులు తనకు మద్యాన్ని అలవాటు చేసి శివరాజ్ ను హత్య చేయించారని ఆరోపించాడు. శివరాజ్ ను హత్య చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని, ఆర్థిక ఇబ్బందులకు గురి చేశారని, కుటుంబ సభ్యులను చంపిస్తామని బెదిరించారని చెప్పాడు. హత్య చేస్తావా? నిన్ను లేపేయాలా? అని అడుగుతుండేవారని, దీంతో తాను హత్య చేయాల్సి వచ్చిందని చెప్పాడు. తన కాలికి చుట్టుకున్న పాము చివరికి తలకు తగిలిందని అన్నాడు. తప్పు చేయకూడదనే అనుకున్నానని, కానీ తప్పలేదని, తన హత్యల వెనుక బీజేపీకి చెందిన నర్సింహ, యాదగిరి, కనకరాజు తదితరులు ఉన్నారని చెప్పాడు. దాదాపు రూ. 70 కోట్ల విలువైన భూమిని ఆక్రమించారని ఆరోపించాడు. తాను హత్య చేసిన శివరాజ్ కుటుంబాన్ని ఆదుకోవాలని చూశానని, కానీ పడనీయలేదని అన్నాడు. తాను రెండేళ్ల నుంచి నగరంలో లేనని, అమ్మకు గుండెపోటు రావడంతోనే తిరిగి వచ్చానని డాకూరి బాబు చెప్పాడు.