: మోదీ కంట కన్నీరు.. ప్రముఖ్‌స్వామి పార్థివదేహాన్ని చూసి ఉద్వేగం


గుజరాత్‌లోని సారంగపూర్‌లో స్వామినారాయణ్ ఆధ్యాత్మిక వర్గం సారథి ప్రముఖ్‌స్వామి(95) పార్థివదేహాన్ని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగంతో కంటతడి పెట్టారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకునేందుకు ప్రయత్నిస్తూ స్వామీజీతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. స్వామీజీ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన బోధనలు చిరకాలం నిలిచే ఉంటాయన్నారు. గొప్ప మార్గదర్శకుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పలువురు ప్రముఖులు స్వామీజీ పార్థివదేహాన్ని సందర్శించారు. రాష్ట్రపతి సంతాపం తెలిపారు. స్వామినారాయణ్ ఆలయంలో స్వామి పార్థివ దేహాన్ని రేపటి(బుధవారం) వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.

  • Loading...

More Telugu News