: భారతీయుల ఆశలు మోయనున్న శ్రీకాంత్...రియో ప్రీ క్వార్టర్స్ లో విజయం


నిన్నటి వరకు రియో ఒలింపిక్స్ లో భారత్ కు పతకం అందిస్తుందని భావించిన దీపా కర్మాకర్ భారతీయుల మనసులు గెలుచుకోగలిగింది కానీ పతకం తేలేకపోయింది. అయితే ఒలింపిక్ పతకంపై తెలుగు ఆటగాడు ఆశలు రేపుతున్నాడు. రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ ప్రవేశించాడు. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ప్రీక్వార్టర్‌ ఫైనల్ మ్యాచ్‌ లో శ్రీకాంత్ డెన్మార్క్ క్రీడాకారుడు జాన్ జోర్గెన్‌ సన్‌ పై 21-19, 21-19 తేడాతో విజయం సాధించాడు. తొలిరౌండ్‌ ఆది నుంచి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోయిన శ్రీకాంత్ విజయం సాధించి, ఒలింపిక్స్ పతకంపై ఆశలు రేపుతున్నాడు.

  • Loading...

More Telugu News