: రియోలో వాళ్లు కూడా 50% డిస్కౌంట్ ప్రకటించారు!
ఒలింపిక్స్ జరుగుతున్న రియోలో దోపిడీ దొంగలు పెరిపోయారు. నడి రోడ్లపై పట్టపగలు టూరిస్టులను దోచేస్తున్నారు. దీంతో ఆటగాళ్లు, టూరిస్టులు రియోలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లడం మానేశారు. ప్రధానంగా మకరానా స్టేడియంకు 1.7 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి పెద్ద రెడ్ లైట్ ఏరియా విలా మిమోసావైపు వెళ్లేందుకు విటులు సాహసించడం లేదు. దీంతో సెక్స్ వర్కర్ల ఆదాయం బాగా పడిపోయింది. ఆదాయం పడిపోవడంతో 12 వేల మంది సెక్స్ వర్కర్లు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. దీంతో ఈ రెడ్ లైట్ ఏరియాలో ధరలు 1500 రూపాయల నుంచి 850 రూపాయలకు పడిపోయాయని తెలుస్తోంది. విదేశీయులకు అర్థమయ్యేందుకు సెక్స్ వర్కర్లు ఇంగ్లిష్, పోర్చుగీస్, ఇతర భాషల్లో డిస్కౌంట్ల వివరాలు తెలియజేస్తూ బోర్డులు కూడా పెట్టడం విశేషం. కాగా, బ్రెజిల్ లో గత 18 ఏళ్లుగా వ్యభిచారం చట్టబద్ధంగా నడుస్తోంది. అయితే, ఇక్కడ వ్యభిచారం చేయడం నేరం కాదు కానీ, వేశ్యాగృహాలు నిర్వహించడం మాత్రం నేరం.