: షికాగో, న్యూజెర్సీ, డాలస్ లలో ఘనంగా భారత స్వాతంత్ర్యదిన వేడుకలు


అమెరికాలో భారత స్వాతంత్ర్యదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని షికాగో, న్యూజెర్సీ, డాలస్ నగరాల్లో భారత జాతీయులు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీలు నిర్వహించారు. సుమారు 20,000 మంది చొప్పున భారత జాతీయులు ఈ స్వాతంత్ర్యదిన వేడుకల్లో పాలుపంచుకున్నారు. దీంతో అమెరికాలోని ఈ పట్టణాల వీధులు మువ్వన్నెల జెండా రెపరెపలతో కొత్త శోభ సంతరించుకున్నాయి. స్వాతంత్ర్యదిన వేడుకల్లో భాగం కావడం గర్వకారణంగా ఉందని పలువురు అమెరికన్లు పేర్కొన్నారు. భారత్ లో స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News