: పుష్కరాల్లోనూ ‘హోదా’ నినాదాలు!... జాతీయ జెండా పట్టుకుని యువకుల వినూత్న స్నానాలు!


ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చేదాకా ఆ రాష్ట్రంలో ఆందోళనలు సద్దుమణిగేలా లేవు. ఇప్పటికే అటు ప్రజా సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని మూడు జిల్లాలలో కృష్ణా పుష్కరాలు జరుగుతున్నాయి. మిగిలిన జిల్లాల నుంచి జనం ఆ మూడు జిల్లాలకు తరలిపోతున్నారు. కృష్ణా పుష్కరాల సందడిలో జనం ప్రత్యేక హోదాను మరిచిపోతారనుకున్నారో, ఏమో కానీ కొద్దిసేపటి క్రితం విజయవాడలోని పుష్కర ఘాట్ లో కొందరు యువకులు ‘హోదా’ నినాదాలతో హోరెత్తించారు. భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాలు చేతబట్టుకుని నదిలోకి దిగిన యువకులు ప్రత్యేక హోదా నినాదాలు చేస్తూ పుష్కర స్నానమాచరించారు.

  • Loading...

More Telugu News