: వీర శునకానికి శౌర్య పతకం.. మిలటరీ చరిత్రలోనే ప్రప్రథమం!


భారత ఆర్మీ చరిత్రలో తొలిసారిగా ఓ సాహస శునకానికి మరణానంతరం శౌర్యపతకం లభించింది. ‘మానసి’ ఆర్మీకి చెందిన ట్రాకర్ డాగ్ యూనిట్‌లో ఓ శునకం. అప్పటికి దాని వయసు నాలుగేళ్లు. ఉత్తర కశ్మీర్‌లో చొరబాట్లను అడ్డుకునే సమయంలో ఉగ్రవాదుల తూటాలకు మానసి, దాని సంరక్షకుడు బషీర్ అహ్మద్ వార్ బలయ్యారు. గతేడాది జూలై 21న తంగధర్ సరిహద్దు వద్ద భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించిన మానసి, బషీర్‌లు వారిని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. ఈ క్రమంలో ముష్కురుల తూటాలకు బలయ్యారు. చొరబాటుదార్లను అడ్డుకునేందుకు తుదికంటా పోరాడి అశువులు బాసిన మానసిని ‘మెన్షన్ ఆఫ్ డిస్పాచెస్’ సర్టిఫికెట్‌తో ఆదివారం సైన్యం సత్కరించింది. బషీర్‌కు సేనా పతకం లభించింది. మానసి పేరు‌ను త్వరలో గెజిట్‌లోకి ఎక్కించనున్నట్టు రక్షణ శాఖ ప్రతినిధి ఎస్‌డీ గోస్వామి తెలిపారు.

  • Loading...

More Telugu News