: ఎలాంటి చర్యలకైనా సిద్ధమని చెబుతున్నా... నేను భయపడడం లేదు: ఉమామాధవరెడ్డి


తప్పు చేసిన వారు మాత్రమే భయపడతారని మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి అన్నారు. విచారణ, దర్యాప్తు ద్వారా తాను తప్పు చేసినట్టు తేలితే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని ఆమె చెప్పారు. నయీమ్ విషయంలో వస్తున్న కథనాలను చూసి తానేమీ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. తప్పు చెయ్యనంత కాలం భయపడాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. తానెవరికీ భయపడడని అన్నారు. ఇలా భయపెట్టి, బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో చేర్చుకుందామని భావిస్తే అది అడియాశేనని ఆమె స్పష్టం చేశారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తాను లొంగే మనిషిని కాదని ఆమె స్పష్టం చేశారు. తన దగ్గర బ్లాక్ మనీ, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు ఉంటే భయపడాల్సిన అవసరం ఉంటుందని, అవేవీ లేని తాను ఎవరికో భయపడాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. తనకు అలాంటి భయాలు లేవని ఆమె స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News