: కంప్యూటర్ ఇంజనీర్ గా డబ్బు సంపాదించలేక నటుడనయ్యా...డబ్బే ముఖ్యం: ఫవాద్ ఖాన్


ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ లో జరిగిన ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ లో బాలీవుడ్ నటుడు ఫవాద్‌ ఖాన్ తాను కేవలం డబ్బు కోసమే సినిమాల్లో నటించడం ప్రారంభించానని తెలిపాడు. పాకిస్థానీయుడైన ఫవాద్ ఖాన్ నటించిన ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ సినిమా స్క్రీనింగ్‌ సందర్భంగా ఆయన ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను కేవలం డబ్బు సంపాదించేందుకే సినీ నటుడనయ్యానని తెలిపాడు. కంప్యూటర్‌ ఇంజినీర్‌ గా పనిచేసిన తాను, ఉద్యోగం ద్వారా సరిపడా డబ్బు సంపాదించలేకపోవడంతో సినీ నటుడనయ్యానని చెప్పాడు. అందరి సమక్షంలో అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని తెలిపాడు. ఇలాంటి అవార్డుతో ప్రపంచ వ్యాప్త అభిమానులు చూపించే ప్రేమ ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని తెలిపాడు.

  • Loading...

More Telugu News