: విజయవాడలో 8 లక్షల మంది పుష్కరస్నానమాచరించారు: చంద్రబాబు
విజయవాడలో కృష్ణా పుష్కరాలు అద్భుతంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కేవలం విజయవాడలోనే 8 లక్షల మంది భక్తులు పుష్కర పుణ్యస్నానమాచరించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పుష్కర ఘాట్లలో సుమారు 21 లక్షల మంది భక్తులు పుణ్యస్నానమాచరించారని ఆయన తెలిపారు. నదుల అనుసంధానం వల్ల అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయని ఆయన చెప్పారు. పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం మొదలు పెట్టిన తాము, ఈసారి కృష్ణా నదిని పెన్నా నదితో అనుసంధానం చేయనున్నామని తెలిపారు. పుష్కర స్నానాలు ఒక మతానికి సంబంధించిన కార్యక్రమం కాదని ఆయన చెప్పారు. ప్రతి ఒక్క మతానికి, ప్రతి కులానికి చెందినదని ఆయన చెప్పారు. అందుకే నదీమతల్లికి అందరూ అనుసంధానం కావాలని ఆయన సూచించారు.