: ఇక ప్రతి ఆదివారం అన్ లిమిటెడ్ ఉచిత కాల్స్: బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్


ప్రభుత్వ రంగ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఖాతాదారులకు శుభవార్త. ఇకపై ప్రతి ఆదివారం బీఎస్ఎన్ఎల్ వాడుతున్న వారు అపరిమిత కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఈ సదుపాయం వచ్చే ఆదివారం, అంటే ఆగస్టు 21 నుంచి లభిస్తుంది. "బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ వాడుతున్న వారు దేశంలోని ఏ నెట్ వర్క్ పరిధిలో ఉన్న ల్యాండ్ లైన్, మొబైల్ ఫోన్లకు అయినా ఉచితంగా ఎంత సేపయినా మాట్లాడవచ్చు. 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఇది భారత ప్రజలకు కానుక" అని టెలికం మంత్రి మనోజ్ సిన్హా ఓ ట్వీట్ లో తెలిపారు. రేపు అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ వివరాలను వెల్లడించనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, దేశంలో 1.43 కోట్ల ల్యాండ్ లైన్ కనెక్షన్లు ఉండగా, వాటిల్లో 57 శాతం బీఎస్ఎన్ఎల్ వే. ప్రస్తుతం రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకూ బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ల నుంచి అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకునే ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 120 నెలవారి అద్దెతో ఈ ప్లాన్లు ప్రారంభమవుతున్నాయి.

  • Loading...

More Telugu News