: రాష్ట్రపతి ప్రణబ్ కుమార్తెకూ తప్పని లైంగిక వేధింపులు
సామాన్యుల మాదిరే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, రాజకీయ నేత షర్మిష్ట ముఖర్జీకూ లైంగిక వేధింపులు తప్పలేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొంది. పార్థమండల్ అనే వ్యక్తి ఆన్ లైన్ లో తనను పలుమార్లు లైంగికంగా వేధిస్తూ మెస్సేజ్ లు పెట్టాడని ఆమె ఆరోపించారు. అతను పోస్ట్ చేసిన అసభ్య మెస్సేజ్ లను స్క్రీన్ షాట్లు తీసి తన ఫేస్ బుక్ ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు. అసభ్య మెస్సేజ్ లు చేస్తున్న కారణంగా తన అకౌంట్ ను మొదట్లో బ్లాక్ చేశానని, కానీ, ఇటువంటి విషయాల్లో మౌనంగా ఉండటం మంచిదికాదని, ఇదే తీరులో మరికొంతమందిని వేధిస్తాడని అనిపించిందని, అందుకే, అతను ప్రొఫైల్, అతను పంపిన మెస్సేజ్ లను స్క్రీన్ షాట్లు తీసి పోస్ట్ చేస్తున్నానని, ఇటువంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదని షర్మిష్ట పేర్కొన్నారు.