: ఆడియో ఫంక్షన్లో మలయాళ గోల!


హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరుగుతోన్న 'ఇద్దరమ్మాయిలతో..' ఆడియో ఫంక్షన్ లో యాంకర్ సుమ మధ్యమధ్యలో మలయాళంలో మాట్లాడుతుంటే, వీక్షకులు అర్థంకాక నోరెళ్ళబెట్టాల్సి వచ్చింది! అయితే, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాత్రం సుమకు దీటుగా మలయాళంలోనే మాట్లాడి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అన్నట్టు సుమ మాతృభాష మలయాళమేనండోయ్. ఇక అల్లు అర్జున్ కు కేరళలోనూ మాంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలుసుకదూ. బన్నీ సినిమాలకు అక్కడ మార్కెట్ వాల్యూ ఎక్కువే. దీంతో, కేరళలోనూ ఆయనకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అలాంటి అభిమానులు కొందరు ఓ బృందంలా ఏర్పడి నేటి ఆడియో ఫంక్షన్లో అద్భుతమైన ఏరోబిక్ ప్రదర్శన చేశారు. ఈ షో వీక్షకులను అలరించింది.

కాగా, ఆడియో రిలీజ్ కార్యక్రమానికి దర్శకుడు పూరి జగన్నాథ్ కుటుంబ సభ్యులు, అల్లు అరవింద్, కేఎస్ రామారావు, దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి, చార్మి, కమెడియన్ శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News