: అమెరికా వైమానిక దాడుల్లో ఐఎస్ కీలక నేత హతం
అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఐఎస్ కీలక నేత హఫీజ్ సయీద్ హతమైనట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. గత నెల 26న ఆఫ్గనిస్తాన్ లోని నాన్ గర్ హర్ ఆచిన్ జిల్లాలో జరిపిన వైమానిక దాడుల్లో హఫీజ్ మరణించినట్లు అమెరికా రక్షణ విభాగం హెడ్ క్వార్టర్స్ పెంటగాన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే, గత ఏడాది నాన్ గర్ హర్ లో జరిగిన వైమానిక దాడుల్లో హఫీజ్ చనిపోయాడని అమెరికా అనుకుంది. కానీ, అతను బతికే ఉన్నట్లు ఐఎస్ నాడు ప్రకటించింది. పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ లలో ఐఎస్ ను విస్తరించేందుకు హఫీజ్ కృషి చేశాడు.