: తమిళ పోలీసుల దాష్టీకం!... పబ్లిగ్గా కుటుంబంపై లాఠీల వర్షం!


దేశంలో ఖాకీల దాష్టీకాలు పెరిగిపోయాయి. సహనం కోల్పోతున్న పోలీసులు నిస్సహాయులపై లాఠీలతో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి ఘటనే తమిళనాడులోని తిరువణ్ణామలైలోని చెంగమ్ పాత బస్టాండ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అతడి భార్య, కొడుకుతో కలిపి ఇద్దరు పోలీసులు లాఠీలతో కుళ్లబొడిచారు. సదరు వ్యక్తి సతీమణి తమ కాళ్లపై పడ్డా ఖాకీల మనసు ఏమాత్రం కరగలేదు. ఆమెపైనా పోలీసుల లాఠీలు నాట్యం చేశాయి. జనంతో రద్దీగా ఉన్న ఆ ప్రాంతంలో తాము బహిరంగంగానే బాధితులను కొడుతున్నామన్న విషయాన్ని పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. సుమారు 3 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News