: వికాస్ ‘పంచ్’ అదిరింది!... రియోలో క్వార్టర్ ఫైనల్ చేరిన కృష్ణన్!
రియో ఒలింపిక్స్ లో సానియా- బోపన్న జోడీ మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో సెమీ ఫైనల్ చేరిందో, లేదో... భారత్ కు చెందిన మరో క్రీడాకారుడు సత్తా చాటాడు. బాక్సింగ్ లో 75 కిలోల విభాగంలో కొద్దిసేపటి క్రితం ముగిసిన మ్యాచ్ లో భారత్ బాక్సర్ వికాస్ కృష్ణన్ క్వార్టర్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్నాడు. టర్కీకి చెందిన బాక్సర్ సిపాల్ పై పవర్ పంచ్ లు విసిరిన వికాస్ 3-0 స్కోరుతో విజయం సాధించాడు. ఈ విజయంతో వికాస్ నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. నిన్నటిదాకా పేలవ ప్రదర్శన కనబరచిన భారత్... నేడు మాత్రం రెండు వరుస విజయాలతో సత్తా చాటింది.