: ఎన్ కౌంటర్ భయంతో రాంజేంద్ర నగర్ కోర్టులో లొంగిపోయిన ఫయీమ్!


నయీమ్ ఎన్ కౌంటర్ తరువాత పరారీలో ఉన్న అతని ప్రధాన అనుచరుడు ఫయీమ్ తెలివిగా రాజేంద్రనగర్ కోర్టులో భార్య సాజిదాతో కలసి లొంగిపోయాడు. నయీమ్ తో పాటు ఫయీమ్ ను కూడా ఎన్ కౌంటర్ చేయాల్సిందేనని కథనాలు వినిపిస్తున్నాయి. నయీమ్ చేయాల్సిన నేరాల అసలు అడ్రస్ ను ఫయీమ్ సూచించేవాడని తెలుస్తోంది. ఇతని నేరాల చిట్టాను సిట్ పోలీసులు బయటకి తీస్తున్నట్టు సమాచారం. నయీమ్ కోసం 100 మంది సభ్యులతో ఫయీమ్ పలు గ్యాంగులు నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాదు, సైబరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరిల్లో ఫయీమ్ డెన్ లు ఏర్పాటు చేసుకున్నట్టు, అతని పేరిట వందల కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. 'భాయ్ పంపాడు' అంటూ ఫయీమ్ డీల్స్ చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. దొరికితే తనను కూడా ఎన్ కౌంటర్ చేసేస్తారన్న భయంతో, తెలివిగా ఫయీమ్ కోర్టులో లొంగిపోయాడు. ఈ క్రమంలో మరి, అతని 100 మంది అనుచరులు ఎక్కడ వున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది.

  • Loading...

More Telugu News