: భారత బాక్సర్లకు తొలగిన నిషేధం ముప్పు
బ్రెజిల్ రియో 2016 ఒలింపిక్స్ బరిలో ఉన్న భారత బాక్సర్లకు అనర్హత ముప్పు తొలగిపోయింది. 64 కిలోల విభాగంలో లిథువేనియా బాక్సర్ పెట్రాస్కస్‌తో జరిగిన బౌట్‌లో మనోజ్ కుమార్ భారత్ పేరున్న దుస్తులు వేసుకోకపోవడం గమనించిన అధికారులు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో అనర్హత వేటు వేస్తామని హెచ్చరించారు. దీంతో రంగంలోకి దిగిన భారత బాక్సింగ్ అసోసియేషన్ అది సాంకేతిక తప్పిదమని వివరణ ఇచ్చింది. తక్షణం అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం సూచించిన విధంగా ఉన్న దుస్తుల కిట్లను అందజేస్తామని, తరువాతి మ్యాచ్ లో నిబంధనలకు అనుగుణమైన దుస్తులు ధరిస్తారని తెలిపారు. అందుకు తగ్గట్టుగా దుస్తులు వారికి అందజేయడం ద్వారా అనర్హత ముప్పు తొలగిపోయిందని సమాచారం.