: అంబేడ్కర్ విగ్రహం కళ్లకు గంతలు కట్టి జనగామలో నిరసన... ఉద్రిక్తత


తెలంగాణ సర్కారు కొత్త జిల్లాలపై ఓవైపు తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తుంటే మ‌రోవైపు త‌మ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేయాలంటూ ప‌లువురు గ్రామ‌స్తులు చేస్తోన్న ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. జ‌న‌గామ‌లో నేటి నుంచి 48 గంటల నిరవధిక బంద్ నిర్వ‌హిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. త‌మ‌ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేయాలంటూ ఈరోజు జేఏసీ నాయ‌కులు ఆందోళ‌న చేప‌ట్టారు. అంబేడ్కర్ విగ్రహం కళ్లకు గంతలు కట్టి త‌మ డిమాండును నెర‌వేర్చాలంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి స్పీకర్ మధుసూదనాచారి కాన్వాయ్‌ వెళుతుండడాన్ని గ‌మ‌నించి దాన్ని అడ్డుకోవడానికి ప్ర‌యత్నించారు. పోలీసులు వెంట‌నే వారిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News