: మరో ఇద్దరు.. నయీమ్ అనుచరులు నవాబ్, రమేశ్ అరెస్టు
ఇటీవలే పోలీసుల ఎన్ కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరులను పట్టుకునే పనిలో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు నల్గొండ జిల్లాలో ఇద్దరు నయీమ్ అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కొద్దిసేపటి క్రితం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో తనిఖీ చేసిన పోలీసులు నయీమ్ అనుచరులు నవాబ్, రమేశ్‌లను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలలో పోలీసులు మరికొంతమందిని పట్టుకునేందుకు గాలింపులు జరుపుతున్నట్లు సమాచారం.