: నేడు మూడు లక్షల మందే... రేపు పాతిక లక్షల మంది విజయవాడకు వచ్చే అవకాశం!
పుష్కరాల తొలి రోజున మధ్యాహ్నం 3 గంటల వరకూ 2 లక్షల మందికి పైగా విజయవాడలోని వివిధ ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించారని కృష్ణా పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ తెలిపారు. నేడు భక్తుల సంఖ్య 3 లక్షలను దాటకపోవచ్చని అంచనా వేస్తున్నట్టు వివరించారు. రేపు మాత్రం భారీగా ప్రజలు వస్తారని భావిస్తున్నామని, సుమారు 25 లక్షల మంది వస్తారన్న అంచనాతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వరుసగా మూడు రోజుల పాటు సెలవులున్న కారణంగా దాదాపు కోటి మంది విజయవాడ పరిసరాల్లోని ఘాట్లలో పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు రాజశేఖర్ తెలిపారు.