: వైఎస్ జగన్ పుష్కర స్నానం 18వ తేదీకి వాయిదా
ఈ నెల 18వ తేదీన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పుష్కర స్నానం చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అసలు జగన్ రేపు పుష్కరస్నానం చేయాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల రేపటి కార్యక్రమం 18కి వాయిదాపడిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.