: ముస్లింల రిజర్వేషన్ల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింలు, ఎస్టీల జీవన ప్రమాణాలను పెంచే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు పలువురు మంత్రులు, సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక శాసనసభ సమావేశంలో ముస్లింల రిజర్వేషన్ల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని అన్నారు. దాని ప్రకారం ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. మరోవైపు ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లపై రాజ్యాంగ నిబంధన ఉందని, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బలహీన వర్గాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని, తమిళనాడు తరహా ప్రత్యేక చట్టం ద్వారా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు.