: బ్యాంకు మోసమా? వెంటనే చెప్పేవారు బాధ్యులు కాదు... ఆర్బీఐ కొత్త పాలసీ


మీ ఖాతాలో మీకు తెలియకుండా డబ్బులు వచ్చి పడ్డాయా? ఏటీఎంలో రూ. 200 విత్ డ్రా చేయాలనుకున్న వేళ రెండు రూ. 500 కాగితాలు వచ్చాయా? ఏటీఎంలో ఎవరైనా విత్ డ్రా చేసి, డబ్బు రాలేదని భావించి వెళ్లిపోయిన వేళ, ఆ తరువాత వెళ్లిన మీకు క్యాష్ డిస్పెన్స్ అయిందా?... ఇలా బ్యాంకు కస్టమర్ల ప్రమేయం లేకుండా జరిగే థర్డ్ పార్టీ నేరాలపై వెంటనే సమాచారాన్ని బ్యాంకు అధికారులకు చేరవేసే ఖాతాదారులపై ఎలాంటి విచారణ జరపరాదంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన విధానాన్ని ఆవిష్కరించింది. గుర్తించిన థర్డ్ పార్టీ మోసాన్ని మూడు రోజుల్లోగా ఫిర్యాదు చేసే కస్టమర్లపై ఎలాంటి విచారణ, ప్రశ్నించడం ఉండదని ఆర్బీఐ తన తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఒకవేళ నాలుగు నుంచి ఏడు రోజుల్లో ఫిర్యాదు చేస్తే, గరిష్ఠంగా రూ. 5 వేల జరిమానాకు మించిన శిక్ష వేయరాదని కూడా ఈ నూతన విధానంలో ఆదేశించింది. ఇదే సమయంలో బ్యాంకు అధికారి తప్పుతో, నగదు లావాదేవీ తప్పుగా జరిగితే, కస్టమర్ ఫిర్యాదు చేసినా, చేయకున్నా ఆ డబ్బు తిరిగి ఖాతాలోకి జమ అవుతుంది. తప్పుడు లావాదేవీ గురించి ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ రూపంలో బ్యాంకు నుంచి సమాచారం అందిన నాటి నుంచి మూడు రోజుల కాలపరిమితిలో విషయాన్ని బ్యాంకుకు తెలియజేయాల్సి వుంటుంది. ఇక కస్టమర్ నుంచి వచ్చే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ 90 రోజుల్లోగా పరిష్కరించాల్సి వుంటుంది. కస్టమర్ తన ఫిర్యాదును ఏ మార్గంలోనైనా చేయవచ్చు. వెబ్ సైట్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్, టోల్ ఫ్రీ నంబర్, హోం బ్రాంచ్... ఇలా ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు.

  • Loading...

More Telugu News