: సీతానగరం ఘాట్‌లో పూజాకార్యక్రమాలను నిలిపివేసి, పురోహితుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే, గుంటూరు జిల్లా సీతానగరం పుష్కరఘాట్‌లో మాత్రం పురోహితులు పూజాకార్యక్రమాలు నిలిపివేశారు. వసతులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు నిరసన తెలుపుతున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల పక్కనే పిండప్రదానం షెడ్లు ఏర్పాటు చేశారంటూ పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూజా కార్యక్రమాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.