: నిజామాబాద్ జిల్లాలో ప్ర‌బ‌లిన అతిసారం... ఇద్ద‌రి మృతి


నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండ‌లం దుర్కిలో అతిసారం ప్ర‌బ‌లింది. కేవ‌లం రెండు రోజుల వ్య‌వ‌ధిలో అతిసారం బారినప‌డి ఇద్ద‌రు మృతి చెంద‌డం ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న రేపుతోంది. మావురం గంగ‌వ్వ‌(50), ముర‌ళి(22) అనే ఇద్ద‌రు వ్య‌క్తులు అతిసారంతో మృతి చెందారు. మ‌రో 40 మంది ఈ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. మరోపక్క దుర్కి, సంగెం గ్రామాల్లో మరో 100 మంది తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. బాధితులు జిల్లాలోని బాన్సువాడ ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. సంబంధిత అధికారులు ఆయా గ్రామాల్లో సంద‌ర్శించి ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News