: వేద పండితులకు కేసీఆర్ ఘన సత్కారం!... పాదాభివందనం చేసిన తెలంగాణ సీఎం!
కృష్ణా పుష్కరాల ప్రారంభం సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వేద పండితులను ఘనంగా సత్కరించారు. నిన్న రాత్రికే మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ కు చేరుకున్న కేసీఆర్... నేటి తెల్లవారుజామునే అక్కడికి సమీపంలోని గొందిమళ్లలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ లో పుష్కర స్నానం చేశారు. ఆ తర్వాత ఆయన పుష్కర ఘాట్ లోనే వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఈ క్రమంలో ఆయన వేద పండితులకు పాదాభివందనం చేశారు. ఆ తర్వాత పేరు పేరునా వేద పండితులకు ఆయన ఘన సత్కారం చేశారు.