: నయీమ్ పోతే ఏం... అక్క 'సలీమా' గ్యాంగ్ ను నడిపిస్తుందని అనుచరుల ధీమా!
మాజీ నక్సలైట్, గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ కావడానికి తోడు, సిట్ దాడులు వేగవంతం కావడంతో అతని గ్యాంగ్ లో గుబులు రేగుతుందని అంతా భావించారు. అయితే పోలీసుల అంచనాలను తల్లకిందులు చేస్తూ నయీమ్ గ్యాంగ్ ధీమాగా ఉంది. ఇప్పటికీ నయీమ్ గ్యాంగ్ లో కీలకంగా పనిచేసే మాజీ నక్సలైట్లు పరారీలో ఉన్నారు. వారంతా తాము బలవంతంగా ఆక్రమించిన భూముల డాక్యుమెంట్లను జాగ్రత్త చేశారు. నయీమ్ లేకున్నా వచ్చిన నష్టమేమీ లేదని, తమ గూండాయిజం, రౌడీయిజానికి కాలం చెల్లలేదని, నయీమ్ అక్క సలీమా గ్యాంగ్ ను నడిపిస్తుందని వారు ధీమా ప్రదర్శిస్తున్నారు. సలీమా పేరిట కూడా నయీమ్ భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టాడని పోలీసులు గుర్తించారు. కాగా, నయీమ్ ఎన్ కౌంటర్ వార్త తెలియగానే సలీమా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయింది. ఆమెతోపాటు కీలక గ్యాంగ్ స్టర్లు కూడా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. దీంతో నయీమ్ దందాపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకాడుతున్నారు.