: విజయవాడలో పుష్కర ఘాట్లకు ప్రతి 3 నిమిషాలకు ఉచిత బస్సు


విజయవాడలో పుష్కర ఘాట్లకు ప్రతి 3 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు సర్వీసు ఉచిత సేవలందించనుంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పుష్కర పార్కింగ్ ప్రాంతాలను ఆయా ఘాట్లకు ఉచిత బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చే బస్సులను ఎన్టీఆర్ యూనివర్శిటీ వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడి నుంచి ఆయా ఘాట్లకు 6 ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీసులు అందుబాటులో వుంటాయి. ఉత్తరాంధ్ర నుంచి వచ్చే బస్సులను వైవీరావు ఎస్టేట్ లోని బస్టాండ్ వరకు అనుమతిస్తారు. అక్కడి నుంచి పుష్కర ఘాట్లకు 65 ఉచిత బస్సు సర్వీసులు ఉంటాయి. హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులను ఇబ్రహీంపట్నంలోని జాకీర్ హుస్సేన్ గ్రౌండ్ వరకు మాత్రమే అనుమతించి, అక్కడి నుంచి పుష్కర ఘాట్లకు వెళ్లేందుకు 45 బస్సు సర్వీసుల ద్వారా ఉచిత సేవలందించనున్నారు. ఇక తిరువూరు, భద్రాచలం నుంచి వచ్చే బస్సులను వీటీపీఎస్ కాలనీ వరకే పరిమితం చేస్తారు. అక్కడి నుంచి 10 ఉచిత బస్సు సర్వీసులు యాత్రికులను ఘాట్ల వద్ద దిగబెడతాయి. కాగా, విజయవాడ బస్టాండ్ లోకి సిటీ బస్సులను మాత్రమే అనుమతించనున్నారు.

  • Loading...

More Telugu News