: చైనా మీడియా చెప్పింది... ఒలింపిక్స్ లో భారత్ రాణించకపోవడానికి కారణాలు ఇవేనట!
ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో రెండో అతిపెద్ద దేశమైన భారత్ ఒలింపిక్ క్రీడల్లో డీలా పడిపోవడం, రాణించలేకపోవడానికి గల కారణాలపై చైనా మీడియా ఒక విశ్లేషణ చేసింది. ఆ విశ్లేషణ ప్రకారం.. * కొరవడ్డ మౌలికసదుపాయాలు * ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉండటం * పేదరికం * క్రీడల వైపు బాలికలను ప్రోత్సహించకపోవడం * మగపిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లుగా మాత్రమే కావాలని కోరుకోవడం * ఇతర క్రీడల కంటే కేవలం క్రికెట్ కే ప్రాధాన్యమివ్వడం * భారత హాకీ క్షీణించిపోవడం * గ్రామీణ ప్రాంతాల వారికి ఒలింపిక్ క్రీడలపై సరైన సమాచారం, అవగాహన కల్పించకపోవడం వంటి కారణాలున్నాయని పేర్కొంది.