: బిస్లా ఒంటరిపోరు వృధా


చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో కళ్ళ ముందు భారీ లక్ష్యం భయపెడుతున్నా, చలించని మన్విందర్ సింగ్ బిస్లా అద్భుత పోరాటం చేశాడు. 201 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్ కతా జట్టును బిస్లా (61 బంతుల్లో 92; 14 ఫోర్లు, 2 సిక్సులు) తన మెరుపు ఇన్నింగ్స్ తో విజయానికి సమీపంలోకి తీసుకువచ్చినా.. దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. చివర్లో మోర్గాన్ (32 నాటౌట్) శ్రమించినా ఫలితం దక్కలేదు. ఆఖరికి కోల్ కతా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులే చేసి 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు సూపర్ కింగ్స్ 3 వికెట్లకు 200 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News