: నయీమ్ భార్య సహా 19 మంది అరెస్టు: 'సిట్' చీఫ్ నాగిరెడ్డి


కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో, నయీమ్ భార్య సాదిత సహా 19 మందిని అదుపులోకి తీసుకున్నామని 'సిట్' అధికారులు తెలిపారు. వారిపై 12 కేసులు నమోదు చేశామని వారు చెప్పారు. నయీమ్ నివాసంలో దొరికిన రెండు కేజీల బంగారం, 2.61 కోట్ల రూపాయలను సీజ్ చేశామని తెలిపారు. నయీమ్ నివాసంలో ఉన్న 9 మంది బాలలను మహబూబ్ నగర్ లోని బాలసదన్ కు తరలించామని వారు చెప్పారు. నయీమ్ విషయంలో బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని సిట్ చీఫ్ నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 599 ప్రాపర్టీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. ఈ డాక్యుమెంట్లు నయీమ్ బినామీ పేర్లతో రిజిస్టర్ చేశారని ఆయన చెప్పారు. అలాగే 19 ఆయుధాలు, నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. డీజీపీ ఆదేశిస్తే ఇతర రాష్ట్రాల్లో అతనిపై ఉన్న కేసులపై కూడా దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News