: రియో ఒలింపిక్స్ లో భారత బాక్సర్లకు షాక్!


ఒలింపిక్స్ లో భారత బాక్సర్లకు అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 2016 రియో ఒలింపిక్స్ లో పలు క్రీడలకు వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లంతా తమ దేశాలకు చెందిన జెర్సీలు ధరించి, తమ ఐడెంటిటీని తెలియజేస్తున్నారు. అయితే, భారతదేశం నుంచి ఒలింపిక్స్ కు హాజరవుతున్న బాక్సర్ల జెర్సీపై వారు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం పేరులేకపోవడాన్ని బాక్సింగ్ అసోసియేషన్ నిబంధనల ఉల్లంఘనగా పేర్కొంది. దీంతో భారత బాక్సర్లపై వేటువేసే దిశగా చర్యలు చేపట్టింది. కాగా ఇప్పటికే ఒలింపిక్స్ లో ప్రీక్వార్టర్స్ లో ముగ్గురు బాక్సర్లు అడుగుపెట్టడంతో ఈ విభాగంలో భారత్ కు పతకాల పంటపండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త సమస్య తలెత్తడంతో, దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు ఇండియా బాక్సింగ్ అసోసియేషన్ రంగంలోకి దిగింది. దీంతో ఈ వివాదం ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

  • Loading...

More Telugu News