: నయీమ్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రెండు కోట్ల రూపాయలు రాజేంద్ర నగర్ కోర్టులో డిపాజిట్: పోలీసులు


నార్సింగిలోని నయీమ్ బెడ్ రూంలో జరిపిన తనిఖీల తరువాత స్వాధీనం చేసుకున్న 2 కోట్ల రూపాయల నగదును రాజేంద్రనగర్ న్యాయస్థానంలో డిపాజిట్ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. నయీమ్ ప్రధాన అనుచరుడు తాజుద్దీన్ ను కూడా పోలీసులు రాజేంద్రనగర్ 23వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో అతనికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా నయీమ్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు, వస్తువులను కూడా న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో వాటిని కూడా డిపాజిట్ చేయనున్నామని పోలీసులు చెబుతున్నారు. కాగా, నయీమ్ నివాసంలో భారీ ఎత్తున నగదు, పత్రాలు, నగలు, ఖరీదైన వస్తువులు లభ్యమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News