: అదీస్ అబాబలో తమ ప్రతాపం చూపించిన పోలీసులు
కొన్ని రోజుల క్రితం ఇథియోపియాలో జరిగిన ఆందోళనల్లో పోలీసులు 67 మందిని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. కాల్పులకు నిరసగా ప్రతిపక్షాల ఆధ్వర్యంలో తాజాగా ఆ దేశ రాజధాని అదీస్ అబాబలో భారీ ర్యాలీ తీయడానికి ప్రయత్నించారు. అయితే, పోలీసులు ర్యాలీలో పాల్గొంటున్న వారిపై తమ ప్రతాపాన్నంతా చూపించారు. వారిపై ఇష్టం వచ్చినట్లు విరుచుకుపడుతూ చితక్కొట్టారు. లాఠీలు చేత బట్టుకొని ఆందోళనకారుల్ని వెంబడించి మరీ కొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.