: నయీమ్ అనుచరులను కూడా హతమార్చాల్సిందే: ప్రజా గాయకురాలు బెల్లి లలిత సోదరి కవిత
ప్రజా గాయకురాలు బెల్లి లలిత 1999 మేలో హత్యకు గురయిన విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ నయీమ్ ఇప్పుడు పోలీసుల చేతిలో హతమైన సందర్భంగా బెల్లి లలిత సోదరి కవిత మీడియాతో మాట్లాడుతూ, పలు ఆరోపణలు చేశారు. బెల్లిలలితను గ్యాంగ్ స్టర్ నయీమ్ వర్గం హత్య చేయడంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని అన్నారు. నయీమ్ అనుచరులను కూడా హతమార్చాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. నయీమ్‌కు సహకరించిన రాజకీయనేతల అంతుకూడా చూడాలని ఆమె అన్నారు. తమ సోదరినే కాకుండా తమ కుటుంబంలో మరో నలుగురుని కూడా నయీమే హతమార్చాడని కవిత అన్నారు. తమ కుటుంబ సభ్యుల హత్యల పట్ల పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆమె అన్నారు. వాటికి రాజకీయ నాయకులే కారణమని ఆరోపించారు. తమ వారిని నయీమ్ నమ్మించి మోసం చేసి తీసుకెళ్లి హత్యచేశాడని ఆమె చెప్పారు. నయీమ్ హతమయినందుకు తమకు సంతోషంగానే ఉందని, అయితే నయీమ్ అనుచరులు ఇంకా బతికే ఉన్నారని, వాళ్లను కూడా హతమార్చాలని ఆమె అన్నారు.