: ఇక నవజాత శిశువులకూ ఆధార్‌కార్డులు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జారీకి తెలంగాణ ప్రభుత్వం యోచన


‘హ్యాపీ బేబీస్.. తెలంగాణ బేబీస్’ పథకం కింద త్వరలో నవజాత శిశువులకు ఆస్పత్రుల్లోనే ఆధార్‌కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ నెలాఖారు నుంచి ఈ పథకం అమలులోకి వస్తుంది. తెలంగాణ శిశు ఆధార్ ప్రాజెక్టులో భాగంగా నవజాత శిశువులకు ఆధార్‌కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు, కావాలనుకుంటే బర్త్ డిఫెక్ట్ రిజిస్ట్రేషన్‌ను కూడా ఉచితంగా అందిస్తారు. ఇందుకోసం నగరంలోని 25 ఆస్పత్రులను ఎంపిక చేశారు. ఇమ్యునైజేషన్ సమయంలో ఆరోగ్యశాఖకు ఈ పథకం ద్వారా ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ పథకాన్ని తొలుత పెట్లబుర్జు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రారంభించనున్నట్టు జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్(ఐటీ) సురేంద్రమోహన్ తెలిపారు.

  • Loading...

More Telugu News