: నయీమ్ ను పెంచి పోషించింది చంద్రబాబే: దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి
గ్యాంగ్ స్టర్ నయీమ్ ను పెంచి పోషించింది చంద్రబాబు నాయుడేనని మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీమ్ ఎదగడానికి చంద్రబాబు అండదండలున్నాయని, నక్సలైట్లను హతమార్చే నిమిత్తం ‘బ్లాక్ కోబ్రా’ల పేరిట అతనిని పెంచి పోషించారని ఆరోపించారు. 2004లో ఒకసారి, 2008 లో మరోసారి నయీమ్ తనను చంపేస్తానని బెదిరించిన మాట వాస్తవమేనన్నారు. 2008లో తన స్వగ్రామమైన చిట్టాపూర్ కు నయీమ్, అతని అనుచరులు వచ్చి తనను చంపేస్తానని చెప్పి బెదిరించి వెళ్లిన విషయాన్ని ఆయన ప్ర్తస్తావించారు. ఈ విషయమై సిద్దిపేట పోలీస్ స్టేషన్ లో నాడు తాను ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడే లేరన్నారు.