: కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం మొదటి యూనిట్ ను జాతికి అకితం చేసిన మోదీ


కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం మొదటి యూనిట్ ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, రష్యాతో తరగని బంధానికి కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం నిదర్శనమని అన్నారు. ఈ అణువిద్యుత్ కేంద్రం నిర్మాణంలో రెండు దేశాల మధ్య మరింత బలమైన బంధం ఏర్పడిందని ఆయన చెప్పారు. రష్యా-భారత్ మధ్య సుదీర్ఘ అనుబంధమే కాకుండా, పుతిన్ తో తమ దోస్తీ కూడా రెండు దేశాల మధ్య మంచి వారధిగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News