: 'మైండ్ గేమ్'తో ప్రత్యర్థిని ఓడించిన భారత బాక్సర్ వికాస్ కృష్ణన్!


రియో ఒలింపిక్స్ లో భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ శుభారంభం చేశాడు. మైండ్ గేమ్ తో ప్రత్యర్థిని బోల్తా కొట్టించిన వికాస్ కృష్ణన్ 3-0 తేడాతో విజయం సాధించి ముందంజవేశాడు. ఇదే మైండ్ గేమ్ కు తోడు సరైన పంచ్ లు విసిరితే భారత్ ఖాతాలో పతకం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు. గత ఆసియా గేమ్స్ లో స్వర్ణం సాధించిన వికాస్ కృష్ణన్ తొలి మ్యాచ్ లో అమెరికా బాక్సర్ ఛార్లెస్ కాన్ వెల్ తో తలపడ్డాడు. తొలి మూడు నిమిషాలపాటు పెద్దగా పంచ్ లు సంధించని వికాస్, ప్రత్యర్థి సంధించిన పంచ్ లను తెలివిగా తప్పించుకుని సత్తాచాటాడు. దీంతో ప్రత్యర్థి చేసిన తప్పులు వికాస్ పాలిట వరంగా మారాయి. దీంతో వికాస్ కృష్ణన్ విజయం సాధించి, ప్రీక్వార్టర్స్ లోకి దూసుకెళ్లాడు. అక్కడ టర్కీకి చెందిన సిపల్ వండెర్ తో తలపడనున్నాడు. దీంతో వికాస్ కృష్ణన్ ప్రత్యర్థులకు పంచ్ లు రుచిచూపి సెమీస్ వరకు వెళ్తే భారత్ కు పతకం ఖాయమని పరిశీలకులు భరోసా ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News